శంషాబాద్ బాధితురాలి పేరును దిషగా పెట్టిన పోలీసులు

అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును, వారి కుటుంబ సభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన

Update: 2019-12-01 15:00 GMT
sajjanar

శంషాబాద్ పరిసరాల్లో కామాంధుల చేతిలో దారుణ హత్యాచారానికి గురైన పశువైద్యురాలి అసలు పేరును ఎవరూ ప్రస్తావించకూడదని, ఇక నుంచి దిషా అనే పేరుతో బాధితురాలిని పిలవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి పేరును మార్చినట్లు సీపీ వెల్లడించారు.

ఇక నుంచి అందరూ జస్టిస్ ఫర్ దిషా పేరుతో పిలవాలని సూచించారు. ఈ పేరు విషయమై సీపీ సజ్జనార్ బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతిని కూడా తీసుకున్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరును వాడొద్దని, జస్టిస్ ఫర్ దిషాకు అందరూ సహకరించాలని ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును, వారి కుటుంబ సభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీపీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Full View

Tags:    

Similar News