Seethakka: ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె..

Seethakka: ఎండతీవ్రత అధికంగా ఉందని... జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తెలంగాణ మంత్రి సీతక్క హెచ్చరించారు.

Update: 2024-03-29 13:00 GMT

Seethakka: ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె..

Seethakka: ఎండతీవ్రత అధికంగా ఉందని... జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తెలంగాణ మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూలీ పనులకు వెళ్లేవారు ఉదయం పూటే వెళ్లి త్వరగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కోల్ బెల్ట్‌తో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుందన్నారు. కావున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దన్నారు మంత్రి సీతక్క.

Tags:    

Similar News