Seethakka: మావోయిస్టు నుంచి రాజకీయ నేతగా సీతక్క

Seethakka: 2001లో ఎల్.‌ఎల్‌.బి చదివిన సీతక్క

Update: 2023-12-07 09:41 GMT

Seethakka: మావోయిస్టు నుంచి రాజకీయ నేతగా సీతక్క

Seethakka: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మావోయిస్ట్ నుంచి కీలక రాజకీయ నేతగా ఎదిగారు. జన జీవన స్రవంతిలో కలిసిన తర్వాత 2001లో సీతక్క హైదరాబాద్‌లో ఎల్.ఎల్.బి. చదివారు. పోరుబాటను వీడిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై గెలుపొందారు. సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

Tags:    

Similar News