Hyderabad: మొదలైన సంక్రాంతి పండుగ రద్దీ.. సొంతూళ్లకు బయల్దేరుతున్న నగరవాసులు
Hyderabad: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెబాట పట్టారు నగరవాసులు.
Hyderabad: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో విజయవాడ- హైదరాబాద్ నేషనల్ హైవేపై రాత్రి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్‌ప్లాజా, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. పంతంగి టోల్‌ప్లాజాలో మొత్తం 16 టోల్స్ ఉన్నాయి. వాహనాల రద్దీ దృష్యా 11 బూత్‌లను విజయవాడ వైపు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్‌లను తెరిచారు అధికారులు. సాధారణ రోజుల్లో 35వేల నుంచి 40వేల వాహనాలు వెళ్తాయని.. సంక్రాంతి సందర్భంగా నిన్న ఒక్కరోజే 60వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ఇవాళ, రేపు నేషనల్ హైవేపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ బూత్‌లలో స్కానింగ్‌తో పాటు హ్యాండ్‌గాన్‌తో స్కాన్ చేస్తూ వాహనాలు పంపిస్తున్నారు.