Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయ
Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చే ఎన్నికల హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు
Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయ
Revanth Reddy: మీడియాతో కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్, రైతులకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చే ఎన్నికల హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటే కాంగ్రెస్ బలం ఏంటో అర్ధం అవుతుందని చిట్ చిట్‌లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్‌కు 25 సీట్లకు మించి రావని రేవంత్‌రెడ్డి అన్నారు.