Rythu Bandhu: రైతులకు శుభవార్త.. రేపటీనుంచే రైతుబంధు

Rythu Bandhu: రైతుబంధు పథకం నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది.

Update: 2021-06-14 02:06 GMT

ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా

Rythu Bandhu: రైతుబంధు పథకం నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 15 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నారు. రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 లక్షల 25వేల 695 మంది అర్హులను గుర్తించిన సీసీఎల్‌ఏ తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను 7లక్షల 508.78 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈసారి కొత్తగా 2.81 లక్షల మందికి రైతుబంధు పథకం వర్తింపజేశామని వెల్లడించారు.

మొదటిసారి రైతుబంధుకు అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాస్‌ పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందొద్దని ఏమైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. అత్యధికంగా 4లక్షల 72 వేల 983 మంది అర్హులుగా ఉన్న నల్లగొండ జిల్లాలో 12.18 లక్షల ఎకరాలకు 6లక్షల 08.81 కోట్లు, అత్యల్పంగా 39వేల 762 మంది అర్హులున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 77 వేల ఎకరాలకు 38.39 కోట్లు నిధులు అవసరమవుతున్నాయని చెప్పారు.

Full View


Tags:    

Similar News