తాత్కాలిక ఆర్టీసీ కార్మికుల నిరసన : RDO చొరవతో ప్రశాంతం

Update: 2019-11-04 05:13 GMT
TSRTC Strike

డిపో మేనేజర్ తమను వేధిస్తున్నాడని, పూర్తి వేతనం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు మహేశ్వరం డిపో ముందు ధర్నా నిర్వహించారు. రోజువారీగా బస్సులకు రూ .2 లక్షల డీజిల్ వాడుతున్నామని, ఆదాయం రూ .50000 కూడా రావడం లేదని డిపో మేనేజర్ రవీందర్ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు తెలిపినట్లు సమాచారం. తాత్కాలిక కార్మికులను డిపో మేనేజర్ ఈ విధంగా వేధిస్తే పని చేయలేమని వారు తెలిపారు. తమకు రోజు వారిగా రూ .1750 చెల్లిస్తామని చెప్పారని, కాని ఇప్పుడు తక్కువ ఆదాయం వచ్చిందంటూ అధికారులు కేవలం 900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వారు తెలిపారు.

ఈ విషయం పైన స్పందించిన ఆర్డీఓ డీఎంను మందలించారు. "ఆదాయం రాకపోయినా బస్సులు నడపాలన్నది ముఖ్యమంత్రి ఆదేశామని వారు తెలిపారు. మళ్ళీ ఇలాంటి విషయాలు సంఘటనలు చోటు చేసుకుంటే మిమల్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఆర్డీఓ డీఎంను హెచ్చరించారు.


Tags:    

Similar News