భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సమావేశం : ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ఈ రోజు సమావేశం నిర్వహించడానికి పిలుపునిచ్చారు.

Update: 2019-11-10 07:04 GMT

టీఎస్‌ఆర్‌టిసి కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 37 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ఈ రోజు సమావేశం నిర్వహించడానికి పిలుపునిచ్చారు. అయితే శనివారంనాడు ట్యాంక్ బండ్‌పై ర్యాలీని చేపట్టడానికి కార్యకర్తలు ప్రయత్నించారు.

దీంతో ఆర్టీసీ కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడమే కాకుండా టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో అక్కడున్నఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లతో దాడి చేసి, అడ్డుకున్న పోలీసులను దాటుకుని చివరకు బండ్‌పైకి చేరారు. అనంతరం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగర పోలీసులు గట్టి భద్రత కల్పించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్ మార్చ్ కార్య్రక్రమాన్నిచేపట్టడానికి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు.



Tags:    

Similar News