దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

Update: 2019-11-18 15:23 GMT

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలంటూ దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ లీడర్లు అశ్వత్థామ రెడ్డి రాజిరెడ్డి తమ ఆందోళనను విరమించారు. సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అశ్వత్థామ రెడ్డి హైకోర్టు ఆదేశాలను పరిశీలించిన తర్వాత సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

అటు ప్రభుత్వం, ఇటు యూనియన్ల మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి నెలన్నర కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షనూ లేకపోవడంతో సమ్మెకు ఎండింగ్‌ ఎప్పుడో తెలియని గందోరగోళం నెలకొంది. హైకోర్టు కల్పించుకున్నప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ మొండిపట్టుదలకు పోవడంతో సమస్య పరిష్కారానికి అడుగు ముందుకుపడటం లేదు. మరోవైపు, తమ ప్రధాన డిమాండైన ఆర్టీసీ విలీనాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టినా, ప్రభుత్వం కఠిన వైఖరి వీడకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Full View



Tags:    

Similar News