స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు.. మంత్రి కేటీఆర్ ఆరా..

Bus Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.

Update: 2023-01-31 07:13 GMT

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు.. మంత్రి కేటీఆర్ ఆరా..

Bus Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను తీసుకొని వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. స్కూల్ బస్సులోని 20 మంది విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని క్షతగాత్రులకు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.

Tags:    

Similar News