వరంగల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం.. టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Warangal: ఓ రైతు మృతి, మరో నలుగురురికి గాయాలు

Update: 2023-03-28 05:12 GMT

వరంగల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం.. టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Warangal: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం రోల్లతండాకు చెందిన రైతులు టాటా ఏసీ వాహనంలో మిర్చీలోడుతో వరంగల్ మార్కెట్ యార్డ్‌కు బయలు దేరుతుండగా ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం మైలారం వద్ద పంచర్ కాగా వాహనాన్ని రోడ్డు పక్కన నిలపడంతో వెనకనుండి వచ్చిన ఆర్టీసీ బలంగా ఢీ కొట్టింది.ఈ ఘటన లో ధరావత్ శ్రీను అనే రైతు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వర్థన పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News