Peddapalli: ప్రైవేటు బస్సు బోల్తా.. 30మందికి తీవ్ర గాయాలు

Peddapalli: పెళ్లి బృందం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ప్రమాదం

Update: 2023-06-26 06:24 GMT

Peddapalli: ప్రైవేటు బస్సు బోల్తా.. 30మందికి తీవ్ర గాయాలు

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి దగ్గర ఓ ప్రైవేటు బస్సు ఆటోను తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. బస్సులో 100 మంది ప్రయాణిస్తుండగా 30 మందికి తీవ్ర గాయాలు కాగా 70 మందికి సల్ప గాయాలయ్యాయి.

రామగుండానికి చెందిన పెళ్లి బృందం హైదరాబాద్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి పెద్దపల్లి ఏసీపీ మహేష్, సీఐ జగదీష్ చేరుకొని గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News