‎సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Patancheru:

Update: 2023-07-17 13:57 GMT

‎సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో రోడ్డుప్రమాదం జరిగింది. పోచారం సమీపంలోని ఓఆర్ ఆర్ పై గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సదా, ధర్మేంద్రగా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వట్టినాగులపల్లిలోని ఓ గ్రానైట్ షాప్ నుంచి రాళ్లను లోడ్ చేసుకొని.. బొల్లారం వైపు ఓఆర్ ఆర్ పై వెళ్లుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, బాధితులంగా బీహార్ వాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News