నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Nizamabad: లారీని ఢీ కొట్టిన కారు
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో అర్ధరాత్రి సమయంలో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్నినిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. మృతులు మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన వారిగా గుర్తించారు.