Revanth Reddy: చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం లభించింది
Revanth Reddy: వైద్య వ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Revanth Reddy: చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం లభించింది
Revanth Reddy: వైద్య వ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బసవతారకం 25వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిధిలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్‌లో ప్రపంచస్థాయి సంస్థలకు హబ్‌లో చోటు కల్పిస్తామని తెలిపారు.
బసవతారకం వార్షికోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం లభించిందన్న రేవంత్.. అభివృద్ధి, సంక్షేమంలో ఆయనతో పోటీపడి పనిచేస్తామన్నారు. అభివృద్ధిలో రెండు తెలుగురాష్ట్రాలు ప్రపంచానికి రోల్ మోడల్ అవ్వాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.