బీఆర్ఎస్‌ను తక్కువ అంచనా వేయవద్దు: సీఎల్పీ సమావేశంలో రేవంత్

వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై సీరియస్‌గా ఆలోచించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు కోరారు.

Update: 2025-03-12 14:31 GMT

  బీఆర్ఎస్‌ను తక్కువ అంచనా వేయవద్దు: సీఎల్పీ సమావేశంలో రేవంత్

 వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై సీరియస్‌గా ఆలోచించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు కోరారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ గురించి మీకు చాలా తక్కువ తెలుసునన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. బీఆర్ఎస్ ను నాన్ సీరియస్ గా తీసుకోవద్దని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని ఆయన సూచించారు.

సంతకం పెట్టి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండొద్దన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం సూచనలు చేస్తున్న సమయంలో ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై సీఎం సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని చెబుతున్న సమయంలోనే ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News