Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ కేంద్రానికి ఫిర్యాదు
Revanth Reddy: ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణ
Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ కేంద్రానికి ఫిర్యాదు
Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంగా వ్యవరిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కౌంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ,సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశారు. రబీ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనిశ్చితి, గందరగోళం, ఆలస్యం వల్ల ధాన్యం సేకరణలో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల మధ్య దళారులకు, మిల్లర్లకు రైతులు పంట అమ్ముకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ ఉదాసీనత వల్ల దాదాపు 35% నుండి 40% మంది రైతులు దోపిడీకి గురయ్యారని లేఖలో వివరించారు.