Tamilisai Soundararajan: కొంతమందికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ ప్రజల కోసం ఎంత కష్టమైనా పనిచేస్తా
Tamilisai Soundararajan: కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ పరోక్షంగా విమర్శలు
Tamilisai Soundararajan: కొంతమందికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ ప్రజల కోసం ఎంత కష్టమైనా పనిచేస్తా
Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగరవేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేశారు. కొంతమందికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ ప్రజల కోసం ఎంత కష్టమైనా పనిచేస్తానని చెప్పారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని.. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇండ్లు కావాలన్నారు. కొందరికి ఫాం హౌస్‌లు కాదు.. అందరికి ఫామ్‌లు కావాలన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని.. తెలంగాణ ప్రజాస్వామ్యం, హక్కులను అందరూ కాపాడుకుందామని పిలుపునిచ్చారు.