Rega Kantha Rao: కాకరేపుతున్న ఖమ్మం రాజకీయాలు.. పొంగులేటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా

Rega Kantha Rao: పొంగులేటిపై చర్యలు తీసుకునే విధంగా కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా

Update: 2023-01-11 04:58 GMT

Rega Kantha Rao: కాకరేపుతున్న ఖమ్మం రాజకీయాలు.. పొంగులేటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా

Rega Kantha Rao: ఖమ్మం జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఖమ్మం వేదికగా బీఆర్‌ఎస్ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. మణుగూరు మండలంలో పినపాక నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఎవరు ఎలా వ్యవహరించినా పార్టీ చూసుకుంటుందని అన్నారు. అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా, పార్టీ అనుమతి తీసుకోకుండా జిల్లాలో పర్యటిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేగా కాంతారావు తెలిపారు. పొంగులేటిపై చర్యలు తీసుకునే విధంగా అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Tags:    

Similar News