Raja Singh: ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి.. ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు అనుమతించరు?
Raja Singh: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సచివాలయంలోకి అనుమతి లేదా?
Raja Singh: ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి.. ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు అనుమతించరు?
Raja Singh: తెలంగాణ సచివాలయం కేంద్రంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రివ్యూ మీటింగ్ కోసం సచివాలయం వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సచివాలయంలోకి అనుమతి లేదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి.. ఎమ్మెల్యేలు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోమని ఎవరు చెప్పారో పోలీసులు వివరణ ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.