Weather Report: ఏపీ, తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
Weather Report: 26న తీవ్రమైన తుఫాన్‌గా మారే అవకాశం
Weather Report: ఏపీ, తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడనుందని.. తీవ్ర తుఫాన్‌గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ తుఫానును రెమాల్ అని పిలుస్తున్నారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్‌గా మారుతుంది. ఇది మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ కారణంగా తీర ప్రాంతంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి తీరప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.