Rain Alert: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలే..! ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Update: 2025-05-20 11:49 GMT

Rain Alert: Telangana to Witness Showers for the Next 4 Days, IMD Issues Yellow Alert

Rain Alert: Telangana to Witness Showers for the Next 4 Days, IMD Issues Yellow Alert

Rain Alert: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశముందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వర్షాల ప్రభావంతో మూడురోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

జిల్లాల వారీగా వర్ష సూచన:

మంగళవారం:

భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.

బుధవారం:

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

గురువారం:

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.

23, 24 తేదీలు:

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలు వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News