తలసానికి గట్టి కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి

దక్షిణ భారతాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చెస్తుందనడం సరికాదని, మంత్రి తలసాని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ అన్నారు.

Update: 2020-02-18 11:10 GMT
Satellite Railway Station foundation

దక్షిణ భారతాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చెస్తుందనడం సరికాదని, మంత్రి తలసాని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం తోపాటుగా.. గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాసరావు మాట్లాడారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి నిధుల గురించి ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో తలసాని వ్యాఖ్యలకు కేంద్రమంత్రి పియూశ్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.258 కోట్లు ఇస్తే.. బీజేపీ రూ.2,602 కోట్లు కేటియించిందని వెల్లడించారు. రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వే లైన్లు వేగంగాపూర్తవుతాయని. రైల్వే కేటాయింపులు అంశం రాష్ట్రాల పరిధిలో ఉండవు.. రైల్వే జోన్ల పరిధిలో ఉంటాయి.'' అని కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ప్రాంభించినట్లు పీయుశ్ గోయల్ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ద్వారా మంత్రి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వల్లే శాటిలైట్ టెర్మినల్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలో ప్రధాన స్టేషన్లలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందని తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

శాటిలైట్ టెర్మినల్‌ను చర్లపల్లి స్టేషన్ లో ఏర్పాటు చేస్తుండడం శుభపరిణామమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కూడా తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుందని వెల్లడించారు. అయితే, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఉత్తరాది మాత్రమే కాకుండా.. దక్షిణ భారతాన్ని కేంద్రం పట్టించుకోవాలని కొత్త ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి పెట్టాలని పీయుశ్ గోయల్‌ను తలసాని కోరారు.



Tags:    

Similar News