నేడు నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: ఉ.9:30కి కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న రాహుల్
నేడు నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్ తెలంగాణలో కొనసాగుతోంది. నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మొదట కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేస్తారు. 11గంటలకు జగిత్యాలలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం... వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కోరుట్లలో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభలో పాల్గొంటారు.