నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన

Rahul Gandhi: మంథనిలో కాంగ్రెస్ బస్సు యాత్ర, రాహుల్ రోడ్‌ షో

Update: 2023-10-19 02:12 GMT

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన 

Rahul Gandhi: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఓ వైపు రోజురోజుకు కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు ఆ పార్టీకి నూతన ఉత్సహాన్ని ఇస్తున్నాయి. మరోవైపు ఆరు గ్యారెంటీలు వరుస సభలతో కాంగ్రెస్‌ హోరెత్తిస్తోంది. కాగా నిన్న రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న రాహుల్‌గాంధీ, బస్సు యాత్రను ప్రారంభించి ములుగు మహిళల సభలో పాల్గొని ఆరుగ్యారెంటీలను వివరించారు.

నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మంథనిలో కాంగ్రెస్ బస్సు యాత్ర, రాహుల్ రోడ్‌ షో ఉండనుంది. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సింగరేణి, ఎన్టీపీసీ, RFCL ఉద్యోగులు, కార్మికులతో రాహుల్‌గాంధీ భేటీ అవుతారు. సాయంత్రం పెద్దపల్లి జిల్లాలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పలు చోట్ల కార్నర్‌ మీటింగ్స్‌ పెట్టబోతున్నారు. రేపు ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం రాహుల్‌గాంధీ నిజామాబాద్ జిల్లా బోధన్‌కు వెళ్లనున్నారు.

Tags:    

Similar News