Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడుతోంది
Rahul Gandhi: అతి త్వరలో బీఆర్ఎస్‌ను తరిమికొడతాం
Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడుతోంది
Rahul Gandhi: తెలంగాణలో BRS ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్‌తో మాత్రమే కొట్లాడటం లేదన్న రాహుల్.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కూటమితో తలపడుతున్నామని తెలిపారు. BRS, BJP, MIM వేరు వేరు పార్టీలని చెప్పుకుంటున్నా.. ఆ మూడు పార్టీలు కలిసిపోయాయన్నారు. అందుకే కేసీఆర్, ఒవైసీపై ఎలాంటి కేసులు లేవన్నారు రాహుల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే లాభపడుతోందని ఆరోపించిన రాహుల్.. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసం ఇవ్వలేదన్నారు.