Raghunandan Rao: గవర్నర్‌ను గౌరవించలేని బిఆర్ఎస్ నాయకులు

Raghunandan Rao: సిట్ విచారణతో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనంలేదు

Update: 2023-04-11 01:52 GMT

Raghunandan Rao: గవర్నర్‌ను గౌరవించలేని బిఆర్ఎస్ నాయకులు

Raghunandan Rao: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ను గౌరవించలేని బిఆర్ఎస్ నాయకులు... అసెంబ్లీలో బిల్లుల ఆమోదానికి కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఎందుకొచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలను బిజెపి ఖరాబ్ చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాటలపై ఎమ్మెల్యే రఘునందన్ రావు మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న సిట్ విచారణతో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News