Raghunandan Rao: హరీష్‌రావుకు తెలియకుండానే సీఎంను కలిసారా?
Raghunandan Rao: రాబోయే ఎంపీ ఎన్నికలతో BRS జీరో అవుతుంది
Raghunandan Rao: హరీష్‌రావుకు తెలియకుండానే సీఎంను కలిసారా?
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ప్రొటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జిల్లా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఈ విషయం తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్లు సన్నాయి నొక్కులు నొక్కతున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఇప్పుడు ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యేలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.