శభాష్ పోలీస్.. వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అన్నిచర్యలను తీసుకుంది.

Update: 2020-03-19 15:34 GMT

ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అన్నిచర్యలను తీసుకుంది. ఈ కోణంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా వైరస్ కట్టడిపై తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గురువారం కొత్తపేట చౌరస్తా వద్ద వాహనదారులకు, ఆటో డ్రైవర్ లకు కరోనా వైరస్ సోకకుండా తీసకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా వివరించారు. చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలని పేర్కొన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలన్నారు.

ఇందుకోసం కొద్దినిమిషాల పాటు వాహనదారులను రోడ్డుపైనే నిలిపివేశారు. దాంతో పాటుగానే ప్రతి ఒక్కరు చేతులను ఏవిధంగా కడుక్కోవాలో ఐదుగరు పోలీస్ కానిస్టేబుల్లతో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రత అవసరమని, పత్రి వ్యక్తికి ఒక మీటర్‌ దూరంగా ఉండి మాట్లాడాలన్నారు. ఎవరికి ఎవరూ కరచాలనం చేసుకోకూడదని సాంప్రదాయ పద్దతిలో అందరికీ నమస్కారం మాత్రమే పెట్టాలని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని కరోనా వైరస్ నివారణపై శిక్షణ పొందిన ఎల్ బీ నగర్ అదనపు ఇన్సెక్టర్ అంజుపల్లి నాగమల్లు ప్రజలకు సూచనలు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.


Full View


Tags:    

Similar News