Puvvada Ajay Kumar: పేపర్లను లీక్ చేసే స్థాయికి దిగజారడం దౌర్భాగ్యం
Puvvada Ajay Kumar: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
Puvvada Ajay Kumar: పేపర్లను లీక్ చేసే స్థాయికి దిగజారడం దౌర్భాగ్యం
Puvvada Ajay Kumar: పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది.. పేపర్లను లీక్ చేసే స్థాయికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిగజారటం దౌర్భాగ్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ... లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని పువ్వాడ తెలిపారు.. అయితే బీఆర్ఎస్ సర్కార్‌ను విమర్శించడానికి కారణం ఏం లేకనే.. టెన్త్ పేపర్లను టార్గెట్ చేశారని మండిపడ్డారు పువ్వాడ.