ఎమ్మెల్యే కూసుకుంట్లకు నిరసన సెగ
Kusukuntla Prabhakar Reddy: అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఎం నాయకులు
ఎమ్మెల్యే కూసుకుంట్లకు నిరసన సెగ
Kusukuntla Prabhakar Reddy: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్లను కాంగ్రెస్, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం వేసిన శిలాఫలకం పనులకే దిక్కులేదని.. మళ్లీ శిలాఫలకం ఎందుకు వేస్తున్నారని అక్కడి స్థానిక నేతలు ప్రశ్నించారు. దీంతో 9 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని కార్యకర్తలు నిలదీశారు. నెల రోజుల్లో పనులు చేయకపోతే... ఓట్లు అడగనని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.