బస్‌భవన్‌లో ఘనంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు

Update: 2019-08-06 11:56 GMT

తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఉద్యమ పథంలో వేసిన అడుగులు భవిష్యత్తు తరాల వారికి మార్గ నిర్ధేశకాలని టి.ఎస్‌.ఆర్‌.టి.సి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం కీర్తించారు. బస్‌భవన్‌లో మంగళవారం ఉదయం ఆచార్య జయశంకర్‌ జయంతి సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహోన్నతుడి జీవితాశయం స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. ఇ.డి (ఎ), టి.వి.రావు, ఇ.డి (ఇ), వినోద్‌, ఇ.డి (ఒ), యాదగిరి, ఇ.డి.(జి.హెచ్.జడ్), వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందించిన సేవలను కోనియాడారు. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారని, తెలంగాణ ఏర్పాటునే శ్వాసగా మలచుకుని తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్ర సాధనకు ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. అర్ధశాస్త్రంలో పట్టు సాధించిన జయశంకర్‌ గొప్ప మేధావి, త్యాగశీలి అని కొనియాడారు.

మహనీయుల ఆశయాల సాధనకు మనవంతు కృషి చేసినప్పుడే వారికి అందించే నిజమైన నివాళి అన్నారు. ఉద్యమ సమయంలో నాయకులకు మార్గనిర్ధేశం చేయడమే కాక ప్రజల్లో చైతన్య బీజం వేసిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్‌ గొప్ప దార్శనికుడు అంటూ నివాళులర్పించారు. ప్రతి ఒక్క సిబ్బంది మహనీయులు జీవితాశయాల పుటలను తిరిగేసి మంచి మార్గంలో నడిచేందుకు ప్రయత్నించి నవ సమాజ నిర్మాణంతో తోడ్పాటునందించడంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు. సి.పి.ఎం సూర్య కిరణ్‌, అధికారులు, యూనియన్‌ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ జి.కిరణ్‌ రెడ్డి సమన్వయం చేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్‌కు ఆశయాలను కీర్తించారు.




Tags:    

Similar News