తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. హైదరాబాద్ టూర్‌లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో రిమోట్ ద్వారా 11 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. 13 వందల 66 కోట్లతో ఎయిమ్స్ అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని. సెకండ్ ఫేజ్ ఎంఎంటీఎస్‌లో భాగంగా జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారు ప్రధాని. సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించారు.