CM KCR Photo: ఫొటోకు పుష్కర స్నానం
Pranahitha Pushkaralu: ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగుతున్న సందర్భంగా పలువురు రైతులు, కేసీఆర్ అభిమానులు ఆయన ఫొటోకు పుష్కర స్నానం చేయించారు.
CM KCR Photo: ఫొటోకు పుష్కర స్నానం
Pranahitha Pushkaralu: ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగుతున్న సందర్భంగా పలువురు రైతులు, కేసీఆర్ అభిమానులు ఆయన ఫొటోకు పుష్కర స్నానం చేయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో కేసీఆర్ భారీ కటౌట్ ను నదిలోకి తీసుకెళ్లి ఆయన ఫొటోకు పుష్కర స్నానం చేయించారు. ఈ పుష్కర స్నానానికి కేసీఆర్ ఫొటోతో పాటు కేటీఆర్ చిత్రపటాలను కూడా ఎడ్లబండ్లతో తీసుకొచ్చి పుణ్యస్నానాలు చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.