Ponnam Prabhakar: కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Ponnam Prabhakar: ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నాం

Update: 2023-12-14 07:06 GMT

Ponnam Prabhakar: కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Ponnam Prabhakar: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని హామీలు అమలు చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాలనా అనుభవం లేక కేటీఆర్‌ అవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి వారం గడవక ముందే పథకాలు అమలుకావడం లేదని మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు పొన్నం. ప్రభుత్వం ప్రారంభమైందే ఇప్పుడని.. త్వరలోనే రైతు పెట్టుబడి సాయం కూడా అందజేస్తామన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు అర్ధరహితమంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News