Warangal: వరంగల్ జలకళను సంతరించుకున్న చెరువులు
Warangal: నర్సంపేట నియోజకవర్గంలో మత్తడి దూకుతున్న పాకాల సరస్సు
వరంగల్ జిల్లలో జలకళ సంతరించుకున్న చెరువులు (ఫైల్ ఇమేజ్)
Warangal: వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం పాకాల సరస్సు మత్తడి పరవళ్లు తొక్కుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాకాల సరస్సులోకి 30 ఫీట్ల నీరు వచ్చి చేరింది. దాంతో సరస్సు పూర్తిగా నిండి మత్తడి పోస్తోంది. పాకాల కింద వందలాది ఎకరాల పంట పొలలు ఉండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.