Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై రాజకీయ వేడి

Modi: కేంద్రం టార్గెట్‌గా బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు

Update: 2023-04-07 07:54 GMT

Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై రాజకీయ వేడి

Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన రాజకీయంగా హీటెక్కిస్తోంది. కేంద్రం టార్గెట్‌గా బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. రాష్ట్రానికి ఏం చేశారంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. 9 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఇచ్చిందేంటి? విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా వచ్చిందా? అన్న అంశాలను లేవనెత్తుతున్నారు. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, నిజామాబాద్‌ పసుపు బోర్డు విషయాలను కేంద్రం మర్చిపోయిందా? జాతీయ స్థాయి హోదా ఉన్న కొత్త విద్యాసంస్థలను ఎందుకు నెలకొల్పలేదంటూ ప్రశ్నిస్తున్నారు. యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్‌ ఎందుకు రద్దు అయిందని నిలదీస్తున్నారు.

Tags:    

Similar News