Harsha Sai: పరారీలో యూట్యూబర్ హర్షసాయి.. లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులు
Harsha Sai Case: యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Harsha Sai: పరారీలో యూట్యూబర్ హర్షసాయి.. లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులు
Harsha Sai Case: యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా.. పరారీలో ఉన్న హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.
బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్షసాయి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిని కలిసి ఆమె ఫిర్యాదు చేశారు బాధితురాలు. హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు... కూల్ డ్రింక్‌లో మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడా?