జనగామ జిల్లా పాలకుర్తిలో పోలీసుల హై అలెర్ట్
* జనగామ జిల్లా పాలకుర్తిలో పోలీసుల హై అలెర్ట్
జనగామ జిల్లా పాలకుర్తిలో పోలీసుల హై అలెర్ట్
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోకి కాసేపట్లో వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేరుకుంటాయి. పాలకుర్తి మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం. పాదయాత్రల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఇద్దరి పాదయాత్రల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రల నేపథ్యంలో దేవరుప్పుల మండలంలో వైన్ షాపులను క్లోజ్ చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.