శివలింగాపురంలో పోలీస్ కార్డన్ సెర్చ్
మండలంలోని శివలింగాపురం గ్రామంలో మణుగూరు డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
మణుగూరు: మండలంలోని శివలింగాపురం గ్రామంలో మణుగూరు డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయో, లేదో తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను మణుగూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతేకాకుండా ప్రతి ఇంటిలోని సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వారి ఆధార్ కార్డ్ లను పరిశీలించారు. అనంతరం రామానుజం మాట్లాడుతూ... ప్రతి పౌరుడు బాధ్యతగా సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిసలౌతున్నారని అన్నారు. గంజాయి,మద్యం మత్తులో యువత అరాచకాలు చేస్తున్నారని, ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఏరియాలో తిరుగుతుంటే పోలీసులకి ఫిర్యాదు చేయాలని సూచించారు.