Green India Challenge: అసెంబ్లీలో మొక్కను నాటిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి
*ఎంపీ సంతోష్ కుమార్‌పై స్పీకర్ పోచారం ప్రసంశలు *కార్యక్రమంలో పాల్గొన్న ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
Green India Challenge: అసెంబ్లీలో మొక్కను నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి(ఫోటో- ది హన్స్ ఇండియా)
Green India Challenge by Pocharam Srinivas Reddy: చెట్ల పండగ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' సరికొత్త పంథాలో ముందుకు సాగుతుంది. తెలంగాణ శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా అసెంబ్లీలో జమ్మి వృక్షాన్ని నాటారు. విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
త్రేతా యుగంలో రాముడికి నీడనిచ్చి, అరణ్యవాసంలో పాండవుల ఆయుధాలకు స్థావరంగా నిలిచిన జమ్మి చెట్టును తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా చేసిందన్నారు.ఇంతటి చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను అభినందిస్తున్నానని తెలిపారు.