PM Modi: హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్‌ను ప్రారంభించిన మోడీ
PM Modi: హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోడీ.
PM Modi: హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్‌ను ప్రారంభించిన మోడీ
PM Modi: హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అదస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీస్ సెంటర్ భారత్‌లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు చెప్పారు.