PM Modi: జులై 8న తెలంగాణకు ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ షెడ్యూల్‌ కన్ఫామ్‌ అయింది.

Update: 2023-06-29 10:29 GMT

PM Modi: జులై 8న తెలంగాణకు ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ షెడ్యూల్‌ కన్ఫామ్‌ అయింది. జూలై 8న వరంగల్‌కు ప్రధాని మోడీ రానున్నారు. కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌తో పాటు.. వరంగల్ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మోడీ. బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే యోచనలో బీజేపీ ఉంది. దీంతో ప్రధాని బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే జూలై 8న హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.

Tags:    

Similar News