Mann Ki Baat: నవ భారత నిర్మాణానికి ప్రజల పద్మాల ఉద్యమం
Mann Ki Baat: 2023లో ప్రధాని మోడీ తొలి మన్ కీ బాత్ కార్యక్రమం
Mann Ki Baat: నవ భారత నిర్మాణానికి ప్రజల పద్మాల ఉద్యమం
Mann Ki Baat: 'ప్రజల పద్మా'ల ఉద్యమం ప్రజల భాగస్వామ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు ప్రధాని మోడీ. ఈ ఉద్యమం నవ భారత నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ఏడాది 'పద్మ' పురస్కారాలను పొందినవారిలో గిరిజన జాతులు, వారితో మమేకమైనవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారన్నారు. 2023లో మొట్టమొదటి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజన జీవితం నగర జీవితం కన్నా భిన్నమైనదని చెప్పారు. గిరిజన జీవన విధానంలో కూడా తనదైన సవాళ్లు ఉన్నాయన్నారు. అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ గిరిజన సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ఆత్రుతతో కృషి చేస్తున్నాయని తెలిపారు.
గిరిజన ప్రాంతాలకు చెందిన పెయింటర్స్, మ్యుజీషియన్స్, రైతులు, కళాకారులు వంటివారు ఈ ఏడాది 'పద్మ' పురస్కారాలను పొందారన్నారు. వీరి కథలు ప్రేరణన ఇస్తాయని, వాటిని చదవాలని ప్రజలను కోరారు. టోటో, హో, కుయి, కువి, మాండా వంటి గిరిజన భాషలపై కృషి చేసిన అనేకమందికి పద్మ పురస్కారాలు లభించాయన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. సిద్ధి, జర్వా, ఒంగే తెగల ప్రజలతో కలిసి కృషి చేస్తున్నవారు కూడా ఈ పురస్కారాలను పొందినట్లు తెలిపారు. మోడీ సందేశాన్ని పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలు వీక్షించారు. ఏలూరులో మన్ కీ బాత్ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ప్రజలతో కలిసి సోము వీర్రాజు మోడీ కార్యక్రమాన్ని వీక్షించారు.