మతం మార్చుకున్నారా?.. కేసీఆర్‌పై పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-02-18 13:18 GMT
Piyush Goyal File Photo

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని టైమ్ స్క్వేర్ హోటల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిసి పని చేయాలని వ్యాఖ్యానించినట్లు గుర్తుచేశారు. అయితే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా.. మంత్రి వర్గంలో తీర్మానం చేయడం సరికాదని పీయుశ్ అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనూ.. అమలు చేయాలని కేసీఆర్‌కు సూచించారు.

ఎంఐఎం పార్టీకి తొత్తుగా కేసీఆర్ వ్యావహరిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇస్తున్న సూచనల మేరకే కేసీఆర్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల లబ్ధి కోసం ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని, తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని దుయ్యబట్టారు, సీఏఏతో ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలు రాష్ట్రాలు వ్యతిరేకించలేవని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా గతంలో అన్నారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

పౌరసత్వ సవరణ చట్టంపై మాట్లాడిన ఆయన.. పాకిస్థాన్‌లో 23 శాతం ఉన్న మైనార్టీలు ఇప్పుడు మూడు శాతారని పడిపోయారని చెప్పారు. ''వీరంతా ఎక్కడికెళ్లారు? అందరూ మతం మార్చుకున్నారా? లేదా వారు మన భారతదేశంలోకి చొరబడ్డారా? ఇతర దేశాల్లో బంగ్లా, పాక్ ఆఫ్గాన్ లో మతపరమైన వేధింపులు, హింసకు గురై దేశంలోకి వచ్చిన వారందరికీ పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతోనే సీసీఏ తీసుకోచ్చామని అని పీయుశ్ గోయల్ స్పష్టం చేశారు.

 

Tags:    

Similar News