TS High Court: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్
TS High Court: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
TS High Court: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్
TS High Court: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాల్ చేస్తూ హరేందర్‌కుమార్ అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జారీ చేసిన జీవో 47ను సవాల్ చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ... జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషన్‌లో తెలిపాడు.
ఈ నిర్ణయం వివక్షతో కూడిందంటూ పిటిషన్‌లో చెప్పారు. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికులసంఖ్య పెరగడంతో పాటు.. అత్యవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయని పిటిషన్‌లో తెలిపారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఛైర్మన్, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు.