తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి.. మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి

Update: 2020-06-02 06:55 GMT
Harish Rao (File Photo)

సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ భర్త అశోక్ విద్యుత్ షాక్ తో మృతి చెందారు. అదేవిధంగా అంగన్ వాడి ఆయా కలవ్వ కు తీవ్ర గాయాలయ్యాయి.

అంగన్‌వాడీ కేంద్రంలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ  ఘటనపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించిన మంత్రి అశోక్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News