కరోనా భయంతో ఊరు వదిలివెళ్లిన ప్రజలు..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2020-04-05 14:03 GMT

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.ఏం చేస్తే తమకు కరోనా సోకదో అని వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్రామం ప్రజలు తమ గ్రామాన్ని, ఇండ్లను వదిలేసి తమ తమ పంట పొల్లాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారికి కావలసిన నిత్యావసరాలను ఒకే సారి తీసుకుని గ్రామం వదిలి వెల్లిపోయారు.

ఈ వింత సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండల కేంద్రంలోని మధురా నగర్‌లో చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారిలో ముగ్గురికి ఒకే రోజు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని వైద్యులు వెంటనే క్వారైంటన్‌కు తరలించారు.

ఈ విషయం తెలియగానే గ్రామస్థులు ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన వారు ఆందోళన చెందారు. పాజిటివ్ అని తేలిన ఆ ముగ్గురు వ్యక్తులు పదిరోజులుగా నేరేడుకొండలోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. వారి బంధువులను, స్నేహితులను కలిసారు. దీంతొ వారు ఎవరెవరిని కలిసారో ఎవరికి వైరస్ సోకిందన్న అనుమానాలు ఆ గ్రామస్తుల్లో నెలకొన్నాయి.

కరోనా బాధితులు నివాసముండే మధురా నగర్‌లో నివసించే ప్రజలు ఎక్కుగా భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో చేసేదేమి లేక ఆ ప్రాంత ప్రజలు సుమారుగా 100 నుంచి 150 కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలేసి తమ పంటపొలాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని వెల్లిపోయారు.  

Tags:    

Similar News