Kamareddy: ఎక్సైజ్ అధికారుల పనితీరుపై ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన ప్రజలు

నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రతి మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు హాజరు కావడంతో కామారెడ్డి చేసి యాదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Update: 2020-02-01 10:46 GMT

జుక్కల్: నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రతి మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు హాజరు కావడంతో కామారెడ్డి చేసి యాదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్సైజ్ ఫారెస్ట్ ఆర్ అండ్ బి ఇరిగేషన్ ఎస్సీ, ఎస్టీ, బిసి వెల్ఫేర్ మత్స్యశాఖ ఆర్ టి సి ఇతర శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజల నుండి ఆయా శాఖలపై వచ్చిన ఫిర్యాదులకు సమాధానం చెప్పేవారు లేకపోవడంతో గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జిల్లాస్థాయి అధికారులు హాజరు అయినా డివిజన్ స్థాయి అధికారులు అలసత్వం వహిస్తున్నారని, అలసత్వం వీడి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రజల నుండి మొత్తం 18 దరఖాస్తులు రాగా అందులో మండల కేంద్రం లోని ప్రజలు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి సమయాల్లో ఖడ్గం మంజీర పరివాహక ప్రాంతం నుండి రాత్రి సమయాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నదని దీనిని వెంటనే అరికట్టాలని ఖడ్గం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

నూతన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మద్దూర్ మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న అల్తాఫ్ అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం 15 రోజుల తర్వాత పాఠశాలకు వెళ్తే ప్రిన్సిపల్ తీసుకోవడంలేదని జుక్కల్ మండల కేంద్రానికి చెందిన అల్తాఫ్ తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజలు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి చంద్రమోహన్ రెడ్డి తహాసీల్దార్ వెంకట్రావు ఎంపీడీవో ఆనంద్ ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News