Peacocks in khammam: పెంపుడు కోళ్ల‌తో గ్రామంలోకి వచ్చిన నెమలి

Update: 2020-07-22 10:37 GMT
ప్రతీకాత్మక చిత్రం

Peacocks in khammam: అడవుల్లో మేత దొరకక చాలా జంతువులు గత కొద్ది రోజులుగా నగరాల బాట పడుతున్నాయి. పులులు, ఎలుగు బంట్లు, అడవిపిల్లులు, ఏనుగులు ఇలా చాల జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ నెమలి కూడా అందంగా అడుగులు వేస్తూ ఓ గ్రామంలోకి వచ్చి చేరుకుంది. గ్రామంలో ఉండే ఓ వ్యక్తి కోళ్లు మేత మేయ‌డానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాటితో పాటు ఓ నెమ‌లి కూడా యజమాని ఇంటికి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిన్నబీరవల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. చిన్నబీరవల్లి గ్రామంలో ఉండే ఓ రైతుకు కొన్ని కోడిపిల్లలు ఉన్నాయి. అవి ప్రతి రోజు మేత కోసం తిరుగుకుంటూ సమీపంలో ఉండే అడవికి వెళులుతుంటాయి. అదే విధంగా మంగవారం కూడా కోళ్లు మేతకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాయి.

అయితే వాటితో పాటు ఓ నెమలి కూడా యజమాని ఇంటికి వచ్చి చేరుకుంది. ఇక దాన్ని చూసిన చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగ ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆ నెమలికి ఎలాంటి హానీ తలపెట్టకుండా వెంటనే ఆ విషయాన్ని అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. విషయం తెలుసుకోగానే అటవీ అధికారులు అక్కడికి వచ్చి నెమ‌లిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధిర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ అడవి జంతువులు తప్పిపోయి గ్రామాల్లోకి వస్తే స్థానికులు సమాచారం ఇవ్వాలని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీతారాములు, బీట్ ఆఫీసర్ కవిత, సురేష్ నెమలిని జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల అట‌వీప్రాంతంలో విడిచిపెట్టారు.

ఇకపోతే ప్రస్తుతం అడవుల్లో ఆహారం దొరకక ఎన్నో జంతువులు అడవులను వదిలి నగరాల్లో, గ్రామాల్లో వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నుంచి కొన్ని చిరుత పులులు ఆహారాన్ని వెతుక్కుంటూ జనావాసంలోకి వస్తున్నాయి. ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.




Tags:    

Similar News